Homeహైదరాబాద్latest Newsఅక్రమంగా తరలిస్తున్న దాన్యం లారీ పట్టివేత.. పోలీసుల అదుపులో డ్రైవర్, క్లీనర్..!

అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారీ పట్టివేత.. పోలీసుల అదుపులో డ్రైవర్, క్లీనర్..!

ఇదే నిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి దాన్యం కొనుగోలు చేసి వారికి మిల్లింగ్ చేయడానికి అప్పగిస్తే కొంతమంది రైస్ మిల్ యజమానులు దాన్యమును పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తే వారిపై కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఆ రైస్ మిల్లు బ్లాక్ లీస్టులో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల ధాన్యం బయట మార్కెట్ కు వెళ్ళిపోయింది.

ఈ ధాన్యం స్థానంలో పిడిఎఫ్ బియ్యం కొనుగోలు చేసి దానిని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ధాన్యాన్ని బయట మార్కెట్లో నాలుగు వేల రూపాయలకు అమ్మకాలు జరిపి, 2 వేల 800 కు పిడిఎఫ్ బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గత గులాబీ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వరకు పెద్ద ఎత్తున రైస్ మిల్లులకు కేటాయించిన దాన్యం పక్కదారి పడుతుంది. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం కూర్ల గ్రామం నుంచి ఓ రైస్మిల్ యజమాని అక్రమంగా ధాన్యం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం కు తరలిస్తుండగా బీర్కూర్ లో పోలీసులు పట్టుకున్నారు.

ఈ ధాన్యమునకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు,వే బిల్లులు లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ లారీల్లో 650 నుంచి 750 వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు అవినీతికి చోటు కల్పించకుండా, అక్రమంగా ధాన్యమును తరలిస్తున్న రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి, ఆయన రైస్ మిల్లు బ్లక్ లిస్ట్ లో పెట్టాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు..ఈ విషయంపై బీర్కూర్ తాసిల్దార్ లతా వివరణ కోరగా, సోమవారం రాత్రి బీర్కూర్ లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని తాసిల్దార్ వెల్లడించారు, ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో పంచనామా చేయడం జరుగుతుందని బీర్కూర్ తాసిల్దార్ లతా వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img