నేడు దేశవ్యాప్తంగా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు వారికీ వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడే టక్కున గుర్తుకొస్తాడు. ఎందుకంటే, ఇక్కడ కొలువయ్యే వినాయకునికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఖైరతాబాద్ వినాయకున్ని చూసేందుకు చాలామంది భక్తులు బారులు తీరుతారు. అయితే ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల ఎత్తులో ఉండనున్నాడు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కావొస్తుండడంతో ఈ సారి ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇక, ఈ ఏడాది వినాయకుడు సప్తముఖ మహాగణపతిగా పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు.