Homeతెలంగాణఓటుకు డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఓటుకు డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • నాలుగు ఓట్లకు రూ.2వేల ఎలా ఇస్తారని గ్రామస్తులతో వాగ్వాదం
  • ఆపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం
  • కామారెడ్డి నియోజకవర్గంలో ఘటన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమకే ఓటు వేయాలని కొందరు నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు అదే పెద్ద తంటాలు తెచ్చిపెట్టింది. గురువారం ఓటుకు డబ్బులు తక్కువ ఇచ్చారని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగిన కామారెడ్డి నియోజకవర్గంలో చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామానికి చెందిన తోకల నారాయణ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. అయితే ఓటుకు రూ.1000 చొప్పున ఇవ్వాలని కోరాడు. కానీ ఓ పార్టీకి చెందినవారు రూ. 2 వేలు ఇచ్చారు. ఓటుకు రూ.1000 చొప్పున తనకు రూ.4 వేలు ఇవ్వాలని అడిగినప్పటికీ.. రూ.2వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా రెండువేలు ఇస్తారేమోనని సాయంత్రం వరకు వేచి చూశాడు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ నారాయణ ఓటు వేయకపోగా.. తన భార్యను కూడా ఓటు వేయనివ్వలేదు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత గ్రామస్తులతో వాగ్వాదానికి దిగాడు. అడిగిన డబ్బులు ఎందుకివ్వలేదని గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో నారాయణ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. దీంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఆ నోట ఈ నోట అందరికి తెలిసి, ఓటుకు నోటు ఇవ్వకుంటే ఆత్మహత్యకు పాల్పడతారా? అంటూ పలువురు నారాయణను మందలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img