Homeహైదరాబాద్latest Newsక్రీడ పాఠశాలకు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక

క్రీడ పాఠశాలకు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంపికకు నాలుగవ తరగతి విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు ఎనిమిది అంశాలపై పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపికలు జరుగుతాయని వ్యాయామ ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి తెలిపారు. ఎంపిక అయిన వారికీ జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, బుచ్చిరెడ్డి, అనిల్, పరుశరాములు, రాజశేఖర్, శ్రీనివాస్, శ్యామ్, పోతుగల్ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ, విద్యార్థినీ..విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img