పంచాయతీకి ఎన్నికలకు కార్యకర్తలు అంతా సిద్ధం కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో అలింగాపురం గ్రామంలో రూ.30 కోట్లతో చేపడుతున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి, ఫిబ్రవరి నెలలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.