ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులలో తిరిగి రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి వైద్యులు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పలు సమస్యలు,మరుగు దొడ్ల సమస్యలపై ఆసుపత్రి సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యేతో పాటుగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు,పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు గన్నె రాజిరెడ్డి,డా. శశి కాంత్ పాల్గొన్నారు.