Homeహైదరాబాద్latest Newsహిందీలో 'పుష్ప 2' మూవీ జోరు తగ్గేదేలే.. వరుణ్ ధావన్ 'బేబీ జాన్' కి తప్పని...

హిందీలో ‘పుష్ప 2’ మూవీ జోరు తగ్గేదేలే.. వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ కి తప్పని కష్టాలు..!

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ నాల్గవ వారంలో కూడా బాక్సాఫీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించింది, తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం శుక్రవారం వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ మూవీ కంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. ‘బేబీ జాన్’ మూవీ రూ. 3.65 కోట్ల రాబెడితే.. ‘పుష్ప 2’ సినిమా రూ. 8.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప 2’ విడుదలైనప్పటి నుండి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 21వ రోజున దాని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రూ. 1,700-కోట్ల మార్క్‌ను దాటింది. ఇంతలో, వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ మూవీ విడుదలై సగటు ఓపెనింగ్‌ను సాధించింది, అయితే ఆ తర్వాత బాక్సాఫీస్ పనితీరు బాగా క్షీణించింది. ఈ చిత్రం తొలిరోజు రూ.11.25 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది, ఆ తర్వాత 2వ రోజు రూ. 4.75 కోట్ల నికర రాబట్టింది. దీంతో హిందీలో ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ సినిమాలకే గట్టి పోటీ ఇస్తుంది.

Recent

- Advertisment -spot_img