Homeహైదరాబాద్latest Newsదేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది.. రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య...

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది.. రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది..!

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. రహస్య గదిలో స్వామివారికి అపార సంపదలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల రహస్య గది రేపు తెరుచుకోనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

పూరీ రత్న భాండాగారానికి డూప్లికేట్‌ తాళంచెవి..!
భాండాగారం డూప్లికేట్‌ తాళపుచెవి కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉందని.. దాంతో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలుపులు తెరుస్తామని జస్టిస్ బిశ్వనాత్ రథ్ కమిటీ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఈ లెక్కింపు ఎప్పటిలోపు పూర్తి అవుతుందో అప్పుడే చెప్పలేం అంటోంది బిశ్వనాథ్ కమిటీ. నగల లెక్కింపు కంప్లీట్ అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ, నియమ నిష్టలతో ఉంటారు.

Recent

- Advertisment -spot_img