యూపీలోని అలీగఢ్‌లో విషాద ఘటన జరిగింది. పిల్కుని నివాసి కన్హయ్యకు ఆర్తితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కన్హయ్య మద్యానికి బానిసగా మారాడు. దీంతో భార్య అతనితో గొడవపడేది. ఒకరోజు గొడవ తారాస్థాయికి చేరడంతో ఆమె తన ఇద్దరు కుమారులు పవన్ (3), అమన్ (3 నెలలు)లకు విషమిచ్చి చంపి.. ఆమె విషం తాగింది. ఇరుగుపొరుగు వారు గమనించి తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించగా.. కొడుకులిద్దరూ మృతి చెందారు. తల్లి చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.