Homeహైదరాబాద్latest Newsచైనాలో విడుదలైన 'మహారాజా' సినిమా.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

చైనాలో విడుదలైన ‘మహారాజా’ సినిమా.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

సాధారణ నటుడి స్థాయి నుంచి నేడు గొప్ప శిఖరానికి చేరుకున్న అగ్రనటుడు విజయ్ సేతుపతి. హీరో, విలన్ లేదా క్యారెక్టర్ ఏదైనా సరే స్కోర్ చేయగల విజయ్ సేతుపతి తన 50వ సినిమా ‘మహారాజా’లో సహజమైన నటనను ప్రదర్శించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా ప్రస్తుతం చైనాలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. మహారాజా సినిమా చైనాలో 40 వేల థియేటర్లలో డబ్ చేసి విడుదలైంది. ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 2.15 కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు 40 వేలకు పైగా థియేటర్లలో సినిమా విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక కలెక్షన్లు పడిపోతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img