రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడు పరమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆస్తిలో వాటా అడగనని బాండ్ రాసివ్వాలని సోదరుడు పరమేశ్ గతంలో చేసిన ఒత్తిడికి నాగమణి అంగీకరించలేదు. దీనికి తోడు పరమేశ్ పెళ్లి రద్దవడం మరో కారణం. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడం, పొలం వివాదం ఉండటంతో అమ్మాయి తరఫు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో అక్కపై కక్ష పెంచుకుని హత్య చేశాడు.