Homeజాతీయండ్రీమ్ 11పై మొదలైన కొత్త వివాదం

డ్రీమ్ 11పై మొదలైన కొత్త వివాదం

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ జరుగనున్న ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్ దక్కించుకున్న డ్రీమ్ 11 కంపెనీ కొత్త వివాదం మొదలైంది. డ్రీమ్ 11 లో చైనా కంపెనీకి పెట్టుబడులు ఉన్నాయన్న విషయం వచ్చింది. దీంతో బీసీసీఐపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండియా చైనా సరిహద్దు ఉద్రిక్తత చైనాకు చెందిన వివోని టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించిన బీసీసీఐచైనా పెట్టుబడులు అన్న మరో కంపెనీకి ఎలా స్పాన్సర్షిప్ కట్టబెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. రూ.222 కోట్లకి బిడ్‌ని దక్కించుకున్న డ్రీమ్ 11 కంపెనీ వ్యవహారాలను పరిశీలించకుండానే ఎలా ఆమోదిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తి పోతుంది. దీనిపై డ్రీమ్ 11 కంపెనీ స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రీమ్ 11లో వాటాదారులు, ఉద్యోగులు (400 మంది) భారతీయులేనని వివరణ ఇచ్చిన ఆ సంస్థ.. చైనాకి చెందిన టెన్సెంట్ కు కేవలం 10 శాతం లోపే పెట్టుబడులు పెట్టిందని చెప్పుకొచ్చింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img