ఏపీలో రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమలులోకి ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 3,396 ప్రైవేట్ మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు చెల్లించాలి. డబ్బులు చెల్లించినట్లు డీడీ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్‌లో ఇవ్వాలి. ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. 12 నుంచి ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభమవుతాయి.