Homeహైదరాబాద్latest Newsశ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భం భక్తుల రద్దీ

శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భం భక్తుల రద్దీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రధాన దేవాలయములో గల స్వామివారికి పంచోపనిషత్లతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే అనుబంద దేవాలయం అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రావణమాసం సోమవారం అయినందున అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించిన తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుభంద దేవాలయములలో గల శ్రీ స్వామివార్లను దర్శించుకున్నారు.

Recent

- Advertisment -spot_img