అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అస్సాం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. వీటి కారణంగా శుక్రవారం మరో ఏడు మరణాలు సంభవించాయి. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 90కి పెరిగింది.