హైదరాబాద్ నగరం గణేష్ నిమజ్జనాలతో కోలాహలంగా మారింది. నగరంలోనే అత్యంత పెద్దదైన ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. కమిటీ సభ్యులు సోమవారం అర్ధరాత్రే కలశపూజ చేసి గణనాథుడ్ని కదిలించి శోభాయాత్రకు సిద్ధం చేశారు. 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియను పూర్తిచేయనున్నారు.