Homeజిల్లా వార్తలుప్రజలకు అందుబాటులో ఉండని పంచాయతీ సెక్రెటరీ.. తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్న గ్రామ ప్రజలు..!

ప్రజలకు అందుబాటులో ఉండని పంచాయతీ సెక్రెటరీ.. తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్న గ్రామ ప్రజలు..!

ఇదేనిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మేజర్ గ్రామపంచాయతీ సెక్రటరీ పని తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పనులపై ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు పంచాయతీ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం 9 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పంచాయతీ సెక్రెటరీ ప్రజాలకు సైతం టైమ్ ఇవ్వకపోవడంతో పంచాయతీ కార్యాలయానికి రాకపోకలు సాగించే ప్రజలు తమ పనులు కాకపోవటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

మరికొందరికి ఫలానా రోజున రమ్మంటూ సమయమిచ్చి, ఆ రోజు పంచాయతీ సెక్రెటరీ అందుబాటులో ఉండకపోవడంతో వివిధ స్థాయిల్లో ప్రజల్లో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం తర్వత వినతులు, ఫిర్యాదులను సమర్పించేందుకు వచ్చే సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో లేకపోవటంతో వారు అసంతృప్తితో ఇంటి ముఖం పడుతున్నారు. ప్రజలకు అందుబాటు లేని పంచాయతీ సెక్రెటరీఎవరి కోసం పని చేస్తున్నారోనని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఉన్నతాధికారుల కార్యక్రమాలకు, సమీక్షలకు, పర్యటనలకు హాజరయ్యేందుకేనా పంచాయతీ సెక్రెటరీ ఉన్నది అంటూ మండిపడుతున్నారు.

వివిధ వివిధ వార్డులలో, గ్రామంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వస్తున్న ప్రజాలకు సెక్రెటరీ అందుబాటులో లేకపోవటంతో దొందుదొందేనా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు నిత్యం పాలకుల చుట్టూ తిరుగుతూ, వారి సేవలో తరించడం కరెక్టేనా అంటూ సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే తరహలో పంచాయతీ సెక్రెటరీ కలిసేందుకు వచ్చిన ఒక వ్యక్తికి సెక్రటరీ ఛాంబర్‌లో ఉన్నా, సిబ్బంది సెక్రటరీ లేరని చెప్పటంతో సెక్రెటరీ పనితీరుకు కూర్చోని నిరసన వ్యక్తం చేసిన ఘటన జరిగినా, ఉన్నతాధికారుల్లో మార్పు రాకపోవడం శోచనీయమని సందర్శకులంటున్నారు.

Recent

- Advertisment -spot_img