Homeహైదరాబాద్latest Newsపార్టీ మారడం లేదు.. నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే: MLA Padi Kaushik Reddy

పార్టీ మారడం లేదు.. నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే: MLA Padi Kaushik Reddy

తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.

“తెలంగాణ ప్రజలకు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం.. ఇవాళ పొద్దున్నే లేవగానే.. సోషల్ మీడియాలో ఒక వార్త చూశాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒక వార్త వచ్చింది. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాను.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌తో, వారి కుటుంబంతో ఉంటాను. పార్టీ మారుతున్నట్లు ఇలాంటి చిల్లర వార్తలు దయచేసి రాయొద్దని జర్నలిస్టులను కూడా కోరుతున్నాను. ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులందరిపై లీగల్ చర్యలు తీసుకుంటాను. త్వరలోనే లీగల్ నోటీసులు పంపిస్తాను. పరువు నష్టం దావా కూడా వేస్తాను. ఇలాంటి వార్తలను నియోజకవర్గ ప్రజలు ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img