గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో బయలుదేరిన తల్లీకొడుకు వరదలో చిక్కుకుపోయారు. ఈ ఘటన విజయవాడ రూరల్‌లో చోటు చేసుకుంది. నున్న గ్రామానికి చెందిన తల్లి రాజకుమారి, కొడుకు గౌతమ్ గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో తమ గమ్యస్థానికి బయలుదేరారు. సావారగూడెం వద్దకు వచ్చేసరికి కారు వరదలో చిక్కుకుంది. దాంతో తమను కాపాడంటూ గన్నవరం తహసీల్దార్ శివయ్యకు బాధితులు లొకేషన్ సెండ్ చేయగా.. సిబ్బంది వారిని వరద నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.