తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ అన్ని పార్టీలు ఈ కేసును ప్రధాన ప్రచారఅస్త్రంగా మార్చుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. తమ ఫోన్ ట్యాప్ చేశారంటూ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.