టీడీపీలోకి నన్ను పిలుస్తున్నారు.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారు..? అని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. తన అనుచరులతో టీడీపీ లో వెళ్లిపోతే ఏం జరుగుతుందని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి ని కాంగ్రెస్, బీజేపీ దూరం పెట్టడంతో మళ్లీ సొంత గూటికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సొంత ఆస్తులు, రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకే మల్లారెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా ఊపు వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యమూ…పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో ఉండడంతో అన్ని విధాలా కలిసి వస్తోందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మల్లారెడ్డి విద్యాసంస్థలపై దాడులు ఆపాలని, కేంద్రంలో తన పని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చేందుకు, తన విద్యాసంస్థలపై దాడులు ఆపాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు.