Homeహైదరాబాద్latest Newsతెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా.. ప్రైవేటు ఆసుపత్రిలో అలా..!

తెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా.. ప్రైవేటు ఆసుపత్రిలో అలా..!

తెలంగాణను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ విషజ్వరాల భారిన పది చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటళ్లలో టైఫాయిడ్‌… డెంగీ… మలేరియా వంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పారిశుధ్యలోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవటంతో జ్వరపీడితులు రాష్ట్రంలో పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఒక సామాన్యుడు ఈ విషజ్వరాల భారిన పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ వారు సరిగ్గా పట్టించు కోరు, ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండదు, సరైన వసతులు ఉండవు. ఎంత నిర్లక్షమంటే.. పేషేంట్లను ఎలుకలు కొరికిన పట్టించుకోనంత నిర్లక్ష్యం. సరే కొంత డబ్బు ఖర్చు అయితే అవ్వని అని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే.. వాడు ఆ టెస్టు.. ఈ టెస్టు.. అని అవసరం లేని ట్రీట్మెంట్ అంతా చేసి.. ఆఖరికి ఆస్తులు అమ్మినా సరిపోనంత బిల్లు వేసి, నిలువు దోపిడీ చేసేస్తున్నారు. ఇలా సామాన్యుడు ఎక్కడికి వెళ్లలేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

Recent

- Advertisment -spot_img