ఖమ్మం జిల్లా కూసుమంచిలో సినిమాలో జరిగినట్లు ఓ సంఘటన జరిగింది. అనుమానంతో పోలీసులు ఇన్నోవా వాహనాన్ని వెంబడించారు. దాదాపు 10 కిలోమీటర్లు వెంటపడ్డారు. కంట్రోల్ తప్పి ఇన్నోవా బోల్తా పడింది. వాళ్ల దగ్గర్నుంచి దాదాపు రూ. కోటిన్నరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.