ఇదే నిజం, ధర్మపురి టౌన్: నిర్మల్ జిల్లా కడెం డ్యామ్ ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత. కడెం ప్రాజెక్టుకి భారీగా చెరుతున్న వరదనీరు 10 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ప్రస్తుతం నిల్వ 695.00 అడుగులు ఇన్ ఫ్లో 65,130 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 79,850 క్యూసెక్కులు.. జగిత్యాల జిల్లా ధర్మపురిమరియు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ.రామ్ నరసింహారెడ్డి ఎస్సై జి. మహేశ్ సూచించారు.