Homeహైదరాబాద్latest Newsగత ప్రభుత్వం మద్యం పాలసీని భ్రష్టు పట్టించింది.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం మద్యం పాలసీని భ్రష్టు పట్టించింది.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం మద్యం పాలసీని భ్రష్టు పట్టించిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. తయారీ నుంచి విక్రయాల వరకు అన్నింటినీ ప్రభుత్వ అధీనంలోనే పెట్టుకున్నారని అన్నారు. తమ సొంత బ్రాండ్లను ప్రచారం చేస్తూ దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. సబ్ కమిటీ ఇటీవల మద్యం పాలసీపై అధ్యయనం చేసి తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందించేలా పాలసీని రూపొందించిందన్నారు. అన్ని మద్యం బ్రాండ్లను ప్రోత్సహించాలని అన్నారు.ప్రభుత్వంపై నమ్మకంతో మద్యం షాపుల కేటాయింపు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, దేవాలయాలు, పాఠశాలలకు 100 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆ షాపులను మూసివేస్తాం.. బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img