వంట నూనె ధరలు కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ప్రజలు ఆశగా ఎదురు చూశారు. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో డిసెంబరు 11న అన్ని రకాల ఆయిల్ విత్తనాల ధరలు తగ్గడంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. మలేషియా ఎక్స్‌ఛేంజ్‌లో పలు ఆయిల్ విత్తనాల ధరలు పడిపోవడంతో మన దేశ మార్కెట్లో ఆయిల్ సీడ్స్ ధరల్లో మార్పులు వచ్చాయి. ఆవాలు, గ్రౌండ్‌నట్, సోయాబీన్ ఆయిల్, ఆయిల్ విత్తనాలతో పాటు క్రూడ్ పామాయిల్, పామోలిన్, పత్తి నూనె ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లలో వంటనూనెల ధరలు తగ్గినా సామాన్యుడికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే, కేవలం హోల్‌సేల్ ధరలు మాత్రమే తగ్గాయి. రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.