ధనత్రయోదశి నాడు మహిళలకు బులియన్ మార్కెట్ షాకిచ్చింది. తగ్గినట్లే తగ్గి బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.650 పెరిగింది. హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,450గా ఉంది. విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,06,900గా ఉంది.