ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను గ్రామ సభలో ఇందిరమ్మ కాలనీలోని చెత్తాచెదారం ఉంటుందని కాలనీలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని సభలో తీర్మానించారు అలాగే ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా ఇండ్ల పట్టాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని మండల కో ఆప్షన్ షాదుల్ పాప సభ దృష్టికి తీసుకురాగా వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని తీర్మానం చేశారు.
అంగన్వాడి టీచర్ బాలమిత్ర ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల అంగన్వాడీలో ఎవరు వస్తలేరని సభలో తెలిపారు రెండున్నర సంవత్సరాల పిల్లలను బాలమిత్ర పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవద్దని సభలో తీర్మానించారు . వానాకాలం తలపిస్తున్న సందర్భంగా సీజన్ వ్యాధులు వాటిల్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ అధికారి తహసిల్దార్ సురేష్. అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ అధికారి తాసిల్దార్ సురేష్. మండల నోడల్ అధికారి రాజిరెడ్డి. ప్రధానోపాధ్యాయులు రవీందర్ కో ఆప్షన్ సభ్యుడు షాదుల్ పాప ఎంపీటీసీ కంచం మంజుల నర్సింలు. జూనియర్ అసిస్టెంట్ బిక్షపతి. అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ఆశ వర్కర్ వివో లు తదితరులు పాల్గొన్నారు.