Homeహైదరాబాద్latest Newsప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఇదేనిజం, కరీంనగర్:ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, పెండింగ్లో పెట్టకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 312 దరఖాస్తులు వచ్చాయి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలివర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధులను నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ దోమల వ్యాప్తిని నివారించాలని, మురికిగుంటల్లో ఆయిల్స్ బాల్స్ వేయాలని సూచించారు. ప్రజలు ఇండ్ల వద్ద పరిశుభ్రత పాటించాలని, బయట ఆహారం తీసుకోవద్దని తెలిపారు. వర్షాకాలంలో తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డిపిఓ రవీందర్, జడ్పి సిఈఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ అంజన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల నిబంధనలు పాటించాలి
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆస్పత్రులకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, మాస్ మీడియా అధికారి రంగారెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్ కిరణ్, కార్యదర్శి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img