Homeహైదరాబాద్latest Newsరేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

ఇదే నిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం, మద్నూర్ మండలంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పటాన్ చేరు లో చేపట్టిన సమావేశానికి మద్నూర్ మండలనికి చెందిన ఆయ గ్రామ రేషన్ డీలర్లు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు రమేష్ దేశాయి మాట్లాడుతూ.. ప్రభుత్వం డీలర్లకు చాలీచాలని కమీషన్లు ఇస్తుండడంతో కుటుంబం నడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేషన్ డీలర్లకు రూ.5 వేల వేతనం పెంచాలని, రూ.300 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సమావేశానికి వెళ్లిన వారిలో జి.హన్మంత్ రావ్ జగదీష్ పవవ్ తదితరులు ఉన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img