ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అర్హులందరికీ 500 లకే గ్యాస్ సిలిండర్ అందించాలని ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ.. ముస్తాబాద్ మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 18,000 పై చిలుకు మంది వినియోగదారులుంటే దాదాపు 7000 మందికి మాత్రమే ఈ 500 రూపాయల పథకం వర్తిస్తుందని మిగతా 11,000 మందికి ఇప్పటివరకు పథకం వర్తించడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రానున్న మాసం రోజుల్లో వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపచేయాలని, డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మహిళా తో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కంచం నర్సింలు, కోడె శ్రీనివాస్, పల్లె సత్యం గౌడ్, సుంచు గణేష్, వంగూరి దిలీప్, రాజు మహిళా వినియోగదారులు పాల్గొన్నారు.