Homeహైదరాబాద్latest Newsఅసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

  • బీజేపీ నాయకులు సౌల్ల క్రాంతి ప్రభుత్వాన్ని డిమాండ్

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో దళిత డిక్లరేషన్ లో దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర దలిత మోర్చ పిలుపు మేరకు ముస్తాబాద్ బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం తాసిల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల చేవెళ్ల సభలో దళిత డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు అంబేద్కర్ అభయ హస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, షెడ్యూల్ కుల సాంఘిక సంక్షేమ వసుతి గృహాలు పునర్నిర్మాణం తదితర అంశాలను రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దళితులను చిన్నచూపు చూస్తుందని ప్రభుత్వమని అన్నారు. వెంటనే మీరు ఇచ్చిన హామీలను అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలి.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 720 కోట్లు కేటాయించాలి. ఇల్లు లేని దళితులకు ఇండ్లు అందించాలని ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందియాలి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు స్వయం ఉపాధి కల్పనకు ప్రతి ఏటా 1000 కోట్లు కేటాయించాలని బీజేపీ నాయకులు సౌల్ల క్రాంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమం లో ఎస్సీ మొర్చ మండల అధ్యక్షులు మీస స్వామి భాజపా మండల అధ్యక్షులు మేరుగు అంజా గౌడ్, ప్రధాన కార్యదర్శులు: సౌల్ల క్రాంతి కుమార్, బాధ నరేష్ జిల్లా అధికార ప్రతినిధి మల్లరపు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్ ఓబిసి చిగురు వెంకన్న, శ్రీనివాస రావు కిసాన్ మోర్చ సత్యం రెడ్డి, గూడ బాల్ రెడ్డి, బట్టు ప్రశాంత్ మీసా కర్ణకర్, గొట్టే నాగరాజు, బీస నరేష్, మదాసు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img