Homeహైదరాబాద్latest Newsకోనో కార్పస్ చెట్ల గురించి అసలు నిజాలు.. అలాగే కొన్ని అపోహలు గురించి ఆసక్తికర విషయాలు...

కోనో కార్పస్ చెట్ల గురించి అసలు నిజాలు.. అలాగే కొన్ని అపోహలు గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..!

మనదేశంలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అలాంటి మొక్కల్లో కోనో కార్పస్ మొక్కలు ఒకటి. ఈ చెట్ల గురించి చాలా అపోహలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కిరణ జన్య సంయోగ క్రియ జరిగితేనే చెట్లు పచ్చగా ఉంటాయని మనకు తెలిసిందే. మొక్కలు సూర్యకాంతి సమక్షంలో, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను వినియోగించుకుని ఆక్సిజన్ ను వదులుతాయి. దీన్నే కిరణ జన్య సంయోగ క్రియ అంటారు. కానీ రాత్రి సమయాల్లో మాత్రం మొక్కలు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ వదులుతాయి. ప్రతి మొక్కలో జరిగేది ఇదే. కానీ అపోహలతో కోనో కార్పస్ మొక్కలు ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను వొదులుతాయని ఈ మొక్కల వల్ల మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అపోహలు సృష్టిస్తున్నారు. ఈ మొక్కల పుష్పాలు పుష్పించినప్పుడు వీటి పరాగ రేణువుల వల్ల కొంత మందికి తుమ్ములు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీటి వేర్లు ఎక్కువగా భూమి లోపలి వెళ్లి భూగర్భ జలాలకు కొంత నష్టం కలిగిస్తాయన్నది నిజం. కాని వీటిని పక్కన పెట్టి అనవసరమైన అపోహలు ఈ మొక్కల పై సృష్టిస్తున్నారు. ఈ మొక్కలు ఉండకూడదు అని సాక్షాత్తు తెలంగాణ స్పీకర్ లాంటి వాళ్ళు కూడా సైన్స్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నిజానికి పచ్చదనాన్ని పెంచడంలో ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే కొంత మంది ఆవులను ప్రేమించే భక్తులు ఆవు కార్బన్ డయాక్సైడ్‌ ను పీల్చుకొని ఆక్సిజన్ ను వదులుతుంది అని అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి మనిషి, జంతువులు ఏ ప్రాణి అయిన ఆక్సిజన్ ను పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్‌ ను వదులుతారు. కాని ఆవు గొప్పతన్నాన్ని పెంచేందుకు కొంత మంది ఇలాంటి అర్ధం పర్థం లేని అపోహలను సృష్టిస్తున్నారు. చాలా మంది వీటిని నమ్ముతున్నారు కూడా..

అలాగే ఆగ నెమలి, మగ నెమలి మధ్య సంభోగ క్రియ జరగకుండా అవి గుడ్లు పెడతాయని అపోహ కూడా ఉంది. ఎలా గుడ్లు పెడతాయి అంటే అవి మగ నెమలి కన్నీటిని ఆడ నెమలి తాగడం వల్ల గుడ్లు పెడతాయని అపోహ సృష్టిస్తున్నారు. నెమలి గొప్పది అని చెప్పేందుకు పెద్ద పెద్ద ప్రసంగ కర్తలు సభలో ఈ అపోహలను ప్రసంగిస్తున్నారు. ఇది చాలా తప్పు అన్ని పక్షులు లాగానే వీటిలో కూడా సంభోగ క్రియ జరగడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. ఇలాంటి అపోహలను నమ్మకండి. వాటిని వ్యాప్తి చేయకండి.

Recent

- Advertisment -spot_img