Homeతెలంగాణ#KTR : ఫ‌లించిన కేటీఆర్‌‌ వ్యూహం

#KTR : ఫ‌లించిన కేటీఆర్‌‌ వ్యూహం

Municipal Minister K Tarakaramarao made the toll-free number available to the Asset Protection Department in August last year to crack down on occupiers and violators.

Citizens were also made partners in the conservation of public places.

కబ్జాదారులు, నిబంధనలు ఉల్లంఘించేవారి ఆట కట్టించడానికి పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గత ఏడాది ఆగస్టులో ఆస్తుల రక్షణ విభాగానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరులను కూడా భాగస్వాములను చేశారు.

ఈ ప్రయోగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలిచ్చిన సమాచారం, అధికారుల చర్యల ఫలితంగా 18 ప్రదేశాల్లో కబ్జాలను గుర్తించి, ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తుల రక్షణ విభాగానికి వచ్చిన ఫిర్యాదు/ సమాచారంపై తక్షణం రంగంలోకి దిగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగాలు.. కబ్జా కోరల్లో చిక్కుకున్న స్థలాలను కాపాడుతున్నాయి.

ఇప్పటివరకు నగరంలోని 18 ప్రధాన ప్రాంతాలలో కబ్జాకు గురైన, కోట్ల రూపాయల విలువైన 4.9 ఎకరాల మేర ఉన్న స్థలాలను జీహెచ్‌ఎంసీకి స్వాధీనం చేశాయి.

ఆ స్థలాల్లో కొన్నింటిలో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.

టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-599-0099

Recent

- Advertisment -spot_img