Homeహైదరాబాద్latest Newsచిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న రోడ్డు.. బస్సు ఎక్కేందుకు కూడా వీలు లేని పరిస్థితి.. బాగు...

చిన్న వర్షానికే చెరువును తలపిస్తున్న రోడ్డు.. బస్సు ఎక్కేందుకు కూడా వీలు లేని పరిస్థితి.. బాగు చేసేదెవరు..?

ఇదే నిజం, లక్షెట్టిపేట: పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో చిన్నపాటి వర్షానికి రోడ్డుపైన నీరు నిలవడంతో చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డుపై నీరు నిలవడంతో బస్సెక్కాలంటే బురద నీటిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏండ్లు గా ఈ సమస్య ఉన్నా అధికారులు అటువైపు చూడక పోవడం సరికాదంటున్నారు ప్రయాణికులు. కాబట్టి వెంటనే కనీసం రోడ్డు పై మట్టి పోసి నీరు నిలవకుండా చూడాలి. చౌరస్తాలో డ్రైనేజీ నిర్మిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ ను వివరణకై ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Recent

- Advertisment -spot_img