తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి నిబంధనలు ఖరారు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 12 నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున జమ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ విడుదల ఉత్తర్వులను ఆర్థిక శాఖకు పంపినట్లు తెలుస్తోంది. రుణమాఫీపై ఇప్పటికే రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తాజాగా రైతు బీమా కోసం దాదాపు రూ.6,500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తోంది.