Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని వారికి సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. శనివారం 78,821 మంది శ్రీవారి దర్శనం చేసుకోగా, 33,568 మంది తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ద్వారా రూ.3.36 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది.