The secret behind why Korean women DON’T gain weight : కొరియన్ మహిళలు అస్సలు లావెక్కరు.. ఎందుకో తెలుసా..
మీరు ఎప్పుడైనా కొరియన్ సినిమాలు చూశారా? ఆ సినిమాల్లో ఉండే హీరోయిన్లను, ఇతర మహిళలను గమనించారా? వాళ్లలో అందరూ స్లిమ్‌గా ఉంటారు.
చూడటానికి సన్నగా, తెల్లగా ఉంటారు. వాళ్ల ముఖం కూడా మెరిసిపోతుంటుంది.
సినిమాల్లో కనిపించే హీరోయిన్లే కాదు.. కొరియాలో ఎక్కడ చూసినా మహిళలు స్లిమ్‌గానే కనిపిస్తారు.
లావుగా ఉన్న మహిళలు జల్లెడ పట్టినా కొరియాలో కనిపించరు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజం.
టీనేజ్ అమ్మాయిల నుంచి పండు ముసలి వరకు ఎవరిని చూసినా స్లిమ్‌గానే కనిపిస్తారు.
లావుగా, ఊబకాయంతో బాధపడుతూ కనిపించేవాళ్లు చాలా చాలా తక్కువ.
మన దేశంలో ఎక్కడ చూసినా లావుగా ఉన్నవాళ్లే కనిపిస్తారు. ఊబకాయంతో బాధపడుతుంటారు.
అధిక బరువు అంటూ టెన్షన్ పడతారు. మరి.. కొరియన్ మహిళలు ఎందుకు అంత సన్నగా ఉంటారు..
అనే కదా మీ డౌట్. పదండి.. వాళ్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందాం.
సమతుల్య ఆహారం
సమతుల్య ఆహారం దాన్నే ఇంగ్లీష్‌లో బ్యాలెన్స్‌డ్ డైట్ అంటాం.
కొరియన్ ప్రజలు బ్యాలెన్స్‌డ్ డైట్‌ను తూచా తప్పకుండా పాటిస్తారు.
ప్రొటీన్స్ దగ్గర్నుంచి ఫ్యాట్.. అన్ని రకాల పదార్థాలను కొరియన్ మహిళలు తింటారు కానీ.. ఎంత తినాలో అంతే తింటారు.
కుంభాలకు కుంభాలు మెక్కరు. అన్ని రకాల ప్రొటీన్స్ ఉన్న ఆహారాన్ని ఎంత వరకు తీసుకోవాలో..
అంత వరకే తీసుకుంటారు. అందుకే వాళ్లు స్లిమ్‌గా ఉంటారు.
కూరగాయలు
కొరియన్ మహిళలు స్లిమ్‌గా, తెల్లగా మెరిసిపోవడానికి మరో కారణం కూరగాయలు.
అవును.. మీరు కొరియన్ ప్రజలు తినే ఫుడ్‌ను చూస్తే ఆశ్చర్యపోతారు.
అందులో ఎక్కువగా కూరగాయలే ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలను కొరియన్ ప్రజలు తీసుకుంటారు.
వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా బరువు పెరగరు.
పులియబెట్టిన ఆహారం
కొరియన్లకు పక్కన సైడ్ డిష్‌గా పులియబెట్టిన ఆహారం ఉండాల్సిందే. పులియబెట్టిన ఫుడ్ ఈజీగా జీర్ణం అవుతుంది.
అలాగే.. ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బూస్ట్ చేయడంతో పాటు బరువు తగ్గేందుకు పులియబెట్టిన ఫుడ్ దోహదపడుతుంది.
ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యత
ఇంటి ఫుడ్ అంత బెస్ట్ ఫుడ్ ఎక్కడా దొరకదు. ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటే పది కాలాల పాటు బతుకుతాం.
కొరియాలో ఎక్కువగా ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినరు.
ప్రాసెస్ చేసిన ఆహారానికి కొరియన్ ప్రజలు దూరంగా ఉంటారు.
ముఖ్యంగా మహిళలు ఇంటి ఫుడ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వాళ్లు అనవసరమైన బరువు పెరగరు.
సీ ఫుడ్
కొరియా ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ సీ ఫుడ్. సముద్ర చేపలను లొట్టలేసుకుంటూ తింటారు.
వాటిని ఎండబెట్టుకొని కూడా కొరియా ప్రజలు వండుకొని తింటారు. చేపలతో సూప్ కూడా చేసుకొని తాగుతారు.
సీ వీడ్ అనే సముద్రంలో పెరిగే మొక్కల ఆకులను కొరియాలో విరివిగా తింటారు.
వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫైబర్.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు పెరగకుండా దోహదపడుతుంది.
నడక
నడక మంచిదే కానీ.. ఈరోజుల్లో ఎవరు నడుస్తున్నారు. కొద్ది దూరం వెళ్లాలన్నా బైకో లేక కారో ఉండాల్సిందే.
కానీ.. కొరియాలో మాత్రం రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు నడిచే వెళ్తారట.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను కూడా తక్కువగా ఉపయోగిస్తారట.
కొరియన్ మహిళలు కూడా ఎక్కువగా నడకకే ప్రాధాన్యత ఇస్తారట. అందుకే వాళ్లు అంత స్లిమ్‌గా ఉంటారన్నమాట.