Homeసినిమాతండేల్​ షూటింగ్ స్టార్ట్

తండేల్​ షూటింగ్ స్టార్ట్

అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్​గా టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా ‘తండేల్’.ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్​కు ఇప్పటికే ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, శనివారం హైదరాబాద్​లో ముహూర్త కార్యక్రమాలతో తండేల్ సినిమా షూటింగ్ అట్టహాసంగా మొదలైంది. నాగచైతన్య తండ్రి, కింగ్ నాగార్జున, వెంకటేశ్ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. హీరోయిన్ సాయి పల్లవి, దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సహా నిర్మాత బన్నీ వాసు తదితర ముఖ్యుల సమక్షంలో ఈరోజు సినిమా ఆరంభం అయింది. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ భారీ ప్రాజెక్ట్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

Recent

- Advertisment -spot_img