Homeహైదరాబాద్latest Newsఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

– మరోసారి దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
– ఆనంద్​ విహార్​లో ఏక్యూఐ 999గా నమోదు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ– గాలిణ్యత సూచీ) మరోసారి దారుణంగా క్షీణించింది. అంతకుముందు రోజు కాస్త మెరుగైనట్లు (ఏక్యూఐ: 395) కనిపించినా.. మళ్లీ అతి తీవ్ర స్థాయి (ఏక్యూఐ: 421)కి చేరింది. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్ 999కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. సిటీలోని మిగతా ప్రాంతాలను కూడా విషపూరిత పొగమంచు కమ్మేసింది. నోయిడాలో ఏక్యూఐ 647గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న ఎయిర్​ పొల్యూషన్​పై సుప్రీంకోర్టు సైత ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ‘ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని’ ఆవేదన చెందింది. ఈ సందర్భంగా ఎయిర్​ పొల్యూషన్​పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ పలు సూచనలు చేసింది. ఈ క్రమంలో కన్నాట్‌ ప్లేస్‌లోని 23 స్మాగ్‌ టవర్లను మళ్లీ వాడేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ స్మాగ్ టవర్‌ ఒక సెకనుకు కిలోమీటర్ పరిధిలోని వెయ్యి క్యూబిక్‌ మీటర్ల గాలిని శుద్ధి చేయగలదు. ఢిల్లీతోపాటు పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ ఎయిర్​ పొల్యూషన్ తీవ్రంగా ఉంది. అక్కడి పంట వ్యర్థాల దగ్ధం నుంచి వెలువడే పొగ ఢిల్లీ వాతావరణంపై ఎఫెక్ట్ చూపుతోంది. పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు.


ప్రత్యామన్నాయ మార్గాలను వెతకడం బెటర్: ఆనంద్ మహీంద్రా


సోషల్‌ మీడియాలో యాక్టివ్​గా ఉండే మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ఢిల్లీలో ఎయిర్​ పొల్యూషన్​ నివారణకు ఓ సలహా ఇచ్చారు. ‘పునరుత్పత్తి వ్యవసాయాన్నిప్రోత్సహించడం ద్వారా ఢిల్లీలో కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాక నేల ఉత్పాదకతను కూడా పెంచుతుంది. పంట వ్యర్థాలను కాల్చడానికి బదులుగా ఈ ప్రత్యామ్నాయాన్ని పాటించడం లాభదాయకం’అంటూ.. అందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్​లో షేర్‌ చేశారు.


ఈ నెల 18వ తేదీ వరకు స్కూళ్లకు వింటర్ హాలీడేస్


ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వింటర్ హాలీడేస్ (శీతాకాల సెలవులు)ను ప్రకటించింది. నేటి నుంచి నుంచి 18వ తేదీ వరకూ అన్ని స్కూళ్లకు ముందస్తు వింటర్ హాలీడేస్ ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఢిల్లీలో స్కూళ్లకు వింటర్ హాలీడేస్​ను జనవరిలో ఇస్తుంటారు. అయితే, ఈసారి ఎయిర్​ పొల్యూషన్​ తీవ్రంగా ఉండటంతో ముందుగానే ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img