Homeహైదరాబాద్latest Newsదారుణం.. డబ్బులివ్వలేదని.. కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు..!

దారుణం.. డబ్బులివ్వలేదని.. కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు..!

డబ్బులివ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్నతల్లిని కర్రతో కొట్టి చంపాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం దుర్కిలో ఈ ఘటన జరిగింది. మెక్క అంజవ్వ(46) భర్త సాయిలు ఏడాది కిందట మృతి చెందగా ఆమెకు రూ.5 లక్షల రైతు బీమా డబ్బులు అందాయి. అంజవ్వ కుమారుడు సాయికుమార్‌ జులాయిగా తిరుగుతూ.. డబ్బులివ్వాలని తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం సాయంత్రం వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తల్లిని కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Recent

- Advertisment -spot_img