దసరాలోగా 4వ విడత రుణమాఫీ చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4.25 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 22 లక్షల మందికి రూ.17,934 కోట్లు మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంకు అకౌంట్ లో తప్పులు ఉన్నవారికి, కుటుంబ నిర్ధారణ కానివారు, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారికి మాఫీ చేస్తారు. ఈ నెలాఖరుతో ఇందుకు సంబంధించిన డేటా అప్లోడ్ ప్రక్రియ ముగియనుంది.