Homeహైదరాబాద్latest Newsరిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్

పాకిస్తాన్‌ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నా 17 ఏళ్ల ప్రయాణంలో సవాళ్లు, విజయాలు మరియు మధురమైన జ్ఞాపకాలతో నిండిపోయింది. నా అరంగేట్రం నుండి ఇప్పటి వరకు నా క్రికెట్ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి జట్టును నడిపించే బాధ్యతను అప్పగించినందుకు పిసిబికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్టకేలకు నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించినందుకు చాలా సంతోషంగా ఉందని బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మ‌రూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు సేవ‌లు అందించారు. పాక్‌ తరపున 136 వన్డేల్లో 3,369 పరుగులు, 44 వికెట్లు, 146 టీ20ల్లో 2,893 పరుగులు, 36 వికెట్లు పడగొట్టారు.

Recent

- Advertisment -spot_img