ఇదే నిజం దేవరకొండ: డిండి మండల హెడ్ క్వార్టర్ లో శుక్రవారం నాడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల దళిత సంఘాలనేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎస్సై మృతికి కారుకులైన అధికారులను డిస్మిస్ చేయాలనీ, ఎస్సై కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల దళిత సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిముదిగొండ ఎల్లేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోమ్మతోటి పౌలు డిమాండ్ చేశారు.తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో దళిత ఉద్యోగులను వేదిస్తే సహించేది లేదని హెచ్చరించారు, దళిత ఉద్యోగులను వేదిస్తున్నటువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మేడి పాపన్న వర్గం దేవరకొండ నియోజకవర్గం కన్వీనర్ ఎర్ర యాదగిరి, ఎమ్మార్పీఎస్ టీఎస్ వంగపల్లి వర్గం మండల కన్వీనర్ ముడి శ్రీను ,మాల మహానాడు నాయకులు మైనర్ బాబు, జార్జ్, యోగి,తదితరులు పాల్గొన్నారు.