తెలంగాణలో టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్ ఫైల్ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా మల్టీజోన్ వన్ పరిధిలో ప్రమోషన్లు క్లియర్ చేయనున్నారు. వరంగల్ పరిధిలోని దాదాపు 10 వేల మంది టీచర్లకు ముందు గుడ్ న్యూస్ రానుంది. తర్వాత హైదరాబాద్ పరిధిలోని టీచర్లకు శుభవార్త అందనుంది.