Homeహైదరాబాద్latest Newsజగిత్యాల జగడం వెనుక అసలు కథ ఇదే..!

జగిత్యాల జగడం వెనుక అసలు కథ ఇదే..!

ఇదే నిజం, జగిత్యాల: కొందరు 200 కోట్లు పెండిగ్ బిల్లుల కోసం అంటున్నారు. మరొకరు తన ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని వచ్చాడని అంటున్నారు. ఇంకొకడు మధ్యవర్తి ద్వారా వచ్చాడని అంటున్నారు. మరొకడు రాజకీయ నాయకుడు అని అనిపించుకున్నాడు. ఇంకొకడు జీవనుడిని తొక్కేయాలని ఇలా చేశారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో అది పక్కన పెడితే. స్థానికంగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు తెలియకుండా ఎవడి స్వార్థం కోసం వాడు, ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎన్నో రోజుల నుండి పార్టీ కోసం కష్టపడ్డ పార్టీ అభిమానులను, కార్యకర్తలను, నాయకులను, పక్కన పెట్టి ఇలాంటి గుంట నక్కలను ప్రోత్సహించడం ఏమాత్రం సరైనది కాదు. ఇది ఈ నియోజకవర్గంలో జరిగింది, రేపు మరో నియోజకవర్గంలో జరుగుతుంది. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే ఉంటే, మనం చూస్తూ పోతే మండల స్థాయిలో ఇదే గ్రామస్థాయిలో ఇదే చివరకు వార్డు స్థాయిలలో కూడా కష్టపడ్డవాన్ని పక్కనపెట్టి వేరేవాడికి సింహాసనం వేస్తూ ఉంటారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారు పిచ్చివారిలా కనిపిస్తున్నారా ఇతరులను పార్టీలోకి ఆహ్వానిచ్చేటప్పుడు స్థానిక నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తెలియకుండా ఎవరికిష్టం వచ్చినట్టు వారు చేస్తే జరిగేది అంతర్ యుద్ధమే అని పిస్తుంది- ఇది నిజం.. ఇదే నిజం

Recent

- Advertisment -spot_img