Homeఫ్లాష్ ఫ్లాష్The 'survey' is a rachcha ‘సర్వే’ రచ్చ

The ‘survey’ is a rachcha ‘సర్వే’ రచ్చ

– హస్తం పార్టీకి అనుకూలంగా లోక్​పాల్​ సర్వే
– ఫేక్​ సర్వే అంటున్న బీఆర్ఎస్​
– పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ బీజేపీ కామెంట్
– లోక్​పాల్​ సర్వేకు ప్రమాణికత ఎంత?

ఇదేనిజం, హైదరాబాద్​: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేలు కూడా సంచలనంగా మారాయి. తాజాగా లోక్​ పాల్​ నిర్వహించిన ఓ సర్వే కాంగ్రెస్​ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. కాగా ఈ సర్వే రిపోర్ట్​ను బీఆర్ఎస్​ నేత హరీశ్​ తీవ్రంగా ఖండించారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని హరీశ్​ దీమా వ్యక్తం చేశారు. లోక్​ పాల్​ సర్వే అంటూ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం తమదే అధికారం అని చెప్పుకుంటున్నారు. ఇటీవల విడుదలైన టౌమ్స్​ నౌ సర్వేలో బీఆర్ఎస్​ 9 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. కాగా తాజాగా లోక్​ పాల్ సర్వేలో అందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 సీట్లు మాత్రమే వస్తాయని.. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం 61 నుంచి 67 సీట్లు రానున్నట్టు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక ఈసారి తెలంగాణలో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్న బీజేపీ మాత్రం 2 నుంచి 3 సీట్లకే పరిమితం కానుందని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇక ఏఐఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని.. ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశాలున్నట్టు లోక్ పోల్ సర్వే చెప్తోంది. సీట్ల విషయంలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీకి సుమారు 15 సీట్లకు పైగానే వ్యత్యాసం కనిపిస్తోన్నా.. ఓటింగ్ విషయంలో మాత్రం పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 42 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్‌కు కూడా 41 నుంచి 44 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని సర్వే చెప్తోంది. ఇక 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకునే బీజేపీ మాత్రం 10 నుంచి 12 శాతం ఓటింగ్ సంపాధించుకునే అవకాశం ఉంది. కాగా.. ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం పార్టీకి మాత్రం మూడు నుంచి 4 శాతం ఓటింగే వచ్చే అవకాశం ఉందని లోక్ పోల్ సర్వేలో తేలింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు తీసుకున్న 60 వేల శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే చేసినట్టు లోక్ పోల్ సంస్థ తెలిపింది. మరి ఈ సర్వే నమ్మదగినదేనా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్నికలకు చాలా ముందు నిర్వహించిన సర్వే కనక.. ఎన్నికల సమయానికి జనం మూడ్​ ఎలా ఉండబోతున్నదన్న చర్చ సాగుతోంది.

పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా లోక్​ పాల్​ ప్రీ సర్వే రిపోర్ట్స్​ ఇలా ఉన్నాయి..

జిల్లా బీఆర్ఎస్​ కాంగ్రెస్​ ఎంఐఎం బీజేపీ

ఆదిలాబాద్ 3–5 2–4 0 0–1
యాదాద్రి భవనగిరి 2–4 4–6 0 0
​చేవెళ్ల 3–5 2–4 0 0
హైదరాబాద్​ 0 2–4 5–7 0–1
కరీంనగర్​ 4–5 1–3 0 0–1
ఖమ్మం 0–1 6–7 0 0
మహబూబాబాద్​ 0–1 6–7 0 0
మహబూబనగర్​ 3–4 3–4 0 0
మల్కాజిగిరి 3–5 1–3 0 0
మెదక్​ 5–6 1–2 0 0
నాగర్​ కర్నూల్​ 2–4 4–6 0 0
నల్లగొండ 1–2 6–7 0 0
నిజామాబాద్​ 5–6 1–2 0 0
పెద్దపల్లి 2–3 4–5 0 0
సికింద్రాబాద్​ 3–4 2–3 0 0
వరంగల్​ 1–2 5–6 0 0
జహీరాబాద్​ 1–2 5–6 0 0

మొత్తం 45–51 61–67 5–7 2–3

Recent

- Advertisment -spot_img