విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సైంధవ్’ కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ హంగులతో మేకర్స్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం టీజర్‌కు కూడా మేకర్స్ రీసెంట్‌గానే డేట్‌ను లాక్ చేశారు.
అక్టోబర్ 16న ఉదయం 11 గంటల 34 నిమిషాలకి అయితే ఈ సాలిడ్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. దీనిపై వెంకీ మామ పై ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను కూడా మేకర్స్ వదిలారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి ఓ యాక్షన్ ప్రాజెక్ట్ వస్తుండడంతో దగ్గుబాటి అభిమానుల్లో ఈ సినిమా పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు.