తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2025కి సాధారణ మరియు ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. వచ్చే ఏడాది మొత్తం 27 సాధారణ సెలవులు మరియు 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తేదీ (జూన్ 2) సెలవుల జాబితాలో లేకపోవడంతో.. జూలై 21ని బోనాలకు సెలవు దినంగా ప్రకటించారు.