జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బస్వాపూర్లో నిన్న రాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులు తిరుపతి, స్వర్ణలతపై దాడికి పాల్పడ్డారు. భర్తను కట్టేసి భార్య గొంతు కోశారు. అనంతరం రూ.లక్ష నగదు, 5 తులాల బంగారం, బైక్ను దొంగలు ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో స్వర్ణలతకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.